Goruvanka Godarivanka Lyrics - Sooraj Jagan,Kousalya
Singer | Sooraj Jagan,Kousalya |
Composer | Chakri |
Music | Chakri |
Song Writer | Bhaskarabhatla |
Lyrics
గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా పూల పడక వేసాను కనుక మంచి ముహూర్తం చూస్తావా పందార తిన్నట్టు తియ్యంగా ఉన్నాది నాకేమిటయ్యిందో తెలియదుగా మందార పువ్వంటి నాజూకు వయ్యారి నన్నేల రమ్మంటు పిలిచెనుగా కలవరమా చెరి సగమా ఏమని చెప్పను భామ యెంతని దాచాను రామ గోదారి కెరటాలు చల్లగాలి పంపుతుంటే గోరువంక గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా పూల పడక వేసాను కనుక మంచి ముహూర్తం చూస్తావా గుప్పెడు గుండెలో ఉప్పెన రేగెను చప్పున నే నిను చూడగా రెప్పలా మాటున ఇప్పటి అలజడి ఎప్పుడు ఎరగను ఇదేమి గొడవ కాకితో కబురెట్టాలి త్వరగా కారణం కనిపెట్టాలిగా అందాల చినుకా బంగారు తునక సింగారి చినుకా ఓ ఓ ఎండల్లో చలిగా గుండెల్లో గిలిగా కొరికేదో రెగినా గోల చేసిన గోరువంక గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా పూల పడక వేసాను కనుక మంచి ముహూర్తం చూస్తావా కమ్ముకు పోయిన తిమ్మిరి యాతన రమ్మని పిలిచెను రా మరి కన్నుల వాకిట పున్నమి పూవుల వెన్నెల కాసెను ఇదేమి చొరవ ప్రేమలో పడిపోయింది మనసా ప్రాయమే చిగురేసిందిగా మంచల్లే కురిసా ముద్దుల్లో మురిసా నిద్దర్లో తలిచా ఓ ఓ వానొచ్చి తడిసా ఊపొచ్చి పిలిచా వాయిదాలు వేయక దాయి దాయి దా గోరువంక గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా పూల పడక వేసాను కనుక మంచి ముహూర్తం చూస్తావా పందార తిన్నట్టు తియ్యంగా ఉన్నాది నాకేమిటయ్యిందో తెలియదుగా మందార పువ్వంటి నాజూకు వయ్యారి నన్నేల రమ్మంటు పిలిచెనుగా కలవరమా చెరి సగమా ఏమని చెప్పను భామ యెంతని దాచను రామ గోదారి కెరటాలు చల్లగాలి పంపుతుంటే అందాల కోయిలమ్మ ఈ వేట కొచ్చెనమ్మ ఓ పాట పాడెనమ్మా ఈ వేళా అందాల కోయిలమ్మ ఈ వేట కొచ్చెనమ్మ ఓ పాట పాడెనమ్మా ఈ వేళా